నమస్తే శేరిలింగంపల్లి: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ హెచ్ఎండబ్ల్యుఎస్ బోర్డ్ ద్వారా మంజూరైన రూ. 20 లక్షలతో నూతనంగా చేపట్టనున్న మంజీరా మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. పాత పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్లు వేసి కలుషిత నీటి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గ్రేటర్ నగర వాసుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 వ తేదీ లోపు వాటర్ క్యాన్ నంబర్లకు ఆదార్ అనుసంధానం చేసుకోవాలని, ఉచిత మంచినీటి పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఎమ్మెల్యే గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నారాయణ, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, మాదాపూర్ డివిజన్ నాయకులు సయ్యద్ గౌస్, ఏకే బాలరాజు, శ్రీనివాస చౌదరీ, రజినీకాంత్, శ్యామ్, లోకేష్, ఖాసీం, సుభాష్ చంద్రబోస్ నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు ముక్తర్, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు మునఫ్ ఖాన్, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు కృష్ణ యాదవ్, డివిజన్ మైనారిటీ అధ్యక్షులు ఎం.ఏ.రహీం, నాయకులు రెహ్మాన్, ఖాసీం, బాబుమియా, సలీం, సత్యనారాయణ, రాములు యాదవ్, బుజంగం, అంకా రావు, అప్పల్ రాజు యాదవ్, భాస్కర్, హరి, యూత్ నాయకులు రవి యాదవ్, గోపి, మహమ్మద్, అఖిల్, భాస్కర్, అంజి, పవన్, మహిళలు ఉమాదేవి మొగులమ్మ, శశిరేఖ, శ్రీజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

