నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్ లో చేపట్టిన అంతర్గత డ్రైనేజీ పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానిక నాయకులు, జీహెచ్ఎంసి అధికారులతో కలసి శుక్రవారం పర్యవేక్షించారు. ప్రేమ్ నగర్ ఏ బ్లాకులోని 4వ నంబర్ వీధి నుండి 7వ నంబర్ వీధి వరకు రూ. 40 లక్షల అంచనా వ్యయంతో, 19వ వీధి నుండి 21వ వీధి వరకు రూ. 32 లక్షల అంచనా వ్యయంతోనూ, 9వ వీధి నుండి 25 వ వీధి వరకు కోటి రూపాయలు అంచనా వ్యయంతోనూ మొత్తంగా ఒక కోటి డభై రెండు లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపడుతున్నట్లు కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటించి, పనులను చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డీఈ రమేష్, ఏఈ జగదీష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్, సయ్యద్ మఖ్బుల్ సాబ్, మహ్మద్ నసీరుద్దీన్, మహ్మద్ ఫరూక్, మెహబూబ్ సాబ్, షేక్ అహ్మద్, జహంగీర్, రవి, ఇస్మాయిల్, సోహిల్, హాజీ, అజ్జు ముల్సబ్, బస్తీ వాసులు ఉన్నారు.