దసరా వేళ జగదీశ్వర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్.. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. దసరా పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బేరి రాంచందర్ యాదవ్, గిరి, యాదన్న గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శి చంద్ర మౌళి, సతీష్, సాయి లోహిత్, శశి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here