శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రగతి ఎన్క్లేవ్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కాలనీ ప్రెసిడెంట్ అట్టేపల్లి రామప్రభు, అసోసియేషన్ సభ్యుల నేతృత్వంలో నవరాత్రులను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ వేడుకలకు కాలనీ వాసులతోపాటు మహిళలు, సమీప కాలనీలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రాకతో ప్రగతి ఎన్క్లేవ్ కాలనీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కాలనీ అసోసియేషన్ సభ్యులు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించడంతో అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు భక్తి వాతావరణంలో వైభవంగా ముగిశాయి.





