గౌతమినగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగలో భాగంగా గౌతమినగర్‌లోని వేముకుంట శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయం వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి జరిగిన ఈ వేడుకల్లో చుట్టుపక్కల కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుషార్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మి మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, విజేతలకు బహుమతులు అందజేశారు.

అనంతరం సుమారు 200 మంది మహిళలు గంగారం చెరువు వద్దకు చేరుకుని బతుకమ్మలకు, గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి, సంప్రదాయబద్ధంగా చెరువులో నిమజ్జనం చేశారు. మహిళలంతా ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలు పండుగ వాతావరణంలో సాగాయి. ఈ కార్యక్రమంలో క్రాంతి లక్ష్మి, సునీత, దీప, నీరజ, కుమారి అనూష, బిందు, రుక్కమ్మ, కవిత తదితర మహిళలతో పాటు గౌతమినగర్ కాలనీ అధ్యక్షుడు ప్రసాద్ రావు, కార్యదర్శి శివప్రసాద్, గాంధీ చౌదరి, ముక్తేశ్వర్ రావు, కట్ల శేఖర్ రెడ్డి, శ్రీకాంత్, రామాంజనేయులు, జగదీశ్, కిషన్ సింగ్, యాదయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను గుఱ్ఱపు విజయలక్ష్మి, రవీందర్ రావు సమన్వయంతో చేపట్టగా, దేవాలయ అర్చకుడు మహేశ్వర్ సహకరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here