దసరా నవరాత్రుల వేళ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.. బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆలయాల సందర్శన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ వివిధ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత గంగారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం మియాపూర్‌లోని శ్రీ విజయ వినాయక యూత్ అమ్మవారి మండపాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here