శేరిలింగంపల్లి, అక్టోబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలకు దసరా కానుకగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని నాయకురాళ్లు, కార్యకర్తలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దసరా, బతుకమ్మ పండుగలు ప్రతీకలని పేర్కొన్నారు. సమాజ హితం కోసం, పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్న మహిళా కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కొనియాడారు. పండుగ వేళ మహిళల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని అన్నారు.

విజయదశమి పర్వదినం శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీ శ్రేణులందరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలకు ప్రత్యేకంగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పద్మ, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష యాదవ్, నాయకురాళ్లు వినయ, శారద, మహేశ్వరి, శోభ, సరోజ, విజయలక్ష్మి, నాయకులు మహేష్ యాదవ్, ప్రసాద్ రెడ్డితో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ, మహిళా మోర్చా ముఖ్య నాయకురాళ్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






