బిజెపి డివిజన్ కమిటీలను వారం రోజుల్లోపు వేయాలి – బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ఇంచార్జ్ యెండల లక్ష్మీనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో పెండింగ్ ఉన్న బిజెపి డివిజన్ కమిటీ, ఆయా మోర్చాల కమిటీలు, పోలింగ్ బూత్ కమిటీలను వారం రోజుల్లో పూర్తి చేయాలని బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ సూచించారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి అధ్యక్షతన చందానగర్ స్వాగత్ హోటల్ లో బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల దృష్ట్యా బీజేపీ బలోపేతానికి అన్ని డివిజన్లలో కమిటీలను వేయాలన్నారు. పేదలకు అండగా నిలవాల్సిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేదల ఇళ్లను తొలగింపజేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను పట్టించుకోకుండా బడా బాబులకు కొమ్ము కాసేలా ప్రవర్తించడం సరికాదన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన వారి పక్షాన బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి అధ్యక్షులు సామ రంగారెడ్డి, బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బిజెపి రాష్ట్ర నాయకులు మారబోయిన రవి కుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ యాదవ్, రాష్ట్ర మహిళ నాయకురాలు నర్రా జయలక్ష్మీ, కాంటెస్ట్ కార్పొరేటర్ రాఘవేంద్రరావు, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, సింధు రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి అనిల్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు మాణిక్యా రావు, ఆంజనేయులు, రాజు శేట్టి, వినయ్ బాబు, శ్రీధర్, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, హరి కృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, యువ మోర్చ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, మజ్దూర్ మోర్చా జిల్లా కన్వీనర్ వర ప్రసాద్ , బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్, బీజేపీ మహిళ నాయకురాలు పద్మ, విజయ లక్ష్మి, బిజెపి డివిజన్ నాయకులు ఆకుల లక్ష్మణ్, రామకృష్ణ రెడ్డి, శ్రీను ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న యెండల‌ లక్ష్మీనారాయణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here