శేరిలింగంపల్లి, అక్టోబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రగతి ఎన్క్లేవ్, ఎఫ్సీఐ కాలనీలలో బీఆర్ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలు, కోలాటాలతో సందడి చేశారు. కాలనీలలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మహిళలకు బతుకమ్మ కానుకలను అందజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ ఐకమత్యంతో జరుపుకోవడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీల పెద్దలు, మహిళలు, యువత, ఏఆర్పీ టీమ్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.






