- సన్నాహక సమావేశంలో టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా డైరీ ఆవిష్కరణ
నమస్తే శేరిలింగంపల్లి: నగరంలోని జలవిహర్ లో ఆదివారం నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ప్రతినిధుల మహాసభ సన్నాహక సమావేశాన్నిశనివారం శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చందానగర్ పీజెఆర్ స్టేడియంలో నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఫైళ్ల విట్ఠల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డిలు మాట్లాడుతూ నగరంలోని జలవిహార్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహాసభకు రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కెటిఆర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, టీయూడబ్ల్యూజే, టెంజు రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడంతో పాటు తాజాగా జర్నలిస్ట్ సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం 17.5 కోట్లు విడుదల, పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. మహాసభకు శేరిలింగంపల్లి జర్నలిస్టులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతంర టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా డైరీని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు రవీందర్ రెడ్డి, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, మారుతి కుమార్ టెంజు అధ్యక్షుడు పి. సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ లతో పాటు ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.