- సంఘం భవనానికి స్థలం, నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతి
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ సగర సంఘం ప్రతినిధులు శనివారం ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొండాపూర్ సగర సంఘం తరపున సంక్షేమ, సామాజిక కార్యక్రమాలు నిర్వహించటానికి సరైన వేదిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ క్రమంలో సగర సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యాలని కోరారు. కాగా తమ అభ్యర్థన పట్ల ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించారని, అతిత్వరలో స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి సహాయపడతానని హామీ ఇచ్చారని, ఈ సందర్బంగా కొండాపూర్ డివిజన్ సగర సంఘం తరపున ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో సగర సంఘం అధ్యక్షులు యు.అశోక్ సాగర్, ప్రధాన కార్యదర్శి అనిల్ సాగర్, కోశాధికారి ఎస్ రామాంజనేయులు సాగర్, ఉపాధ్యక్షులు ఏ జైపాల్ సాగర్, ఉపాధ్యక్షులు బి ఆంజనేయులు సాగర్, ఉపాధ్యక్షులు ఎన్ పరంధాములు సాగర్, గౌరవ అధ్యక్షులు సిద్ధప్ప సాగర్, జాయింట్ సెక్రెటరీ కేశవులు సాగర్ తదితరులు ఉన్నారు.