నమస్థే శేరిలింగంపల్లి: ప‌్రజా సంఘాలు బలపరిచిన ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రో”కె.నాగేశ్వర్‌కు మద్ధతుగా వారి టిమ్ చందా నగర్ పరిసర ప్రాంతాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. హుడాకాలని, పేజ్-2, కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, జీహెచ్ఎంసీ, జలమండలి కార్యాలయాలలో పట్టభద్ర ఓటర్లను కలిసి నాగేశ్వర్‌కు ఓటు వేయాలని కోరారు. సిరియాల్ నెంబర్ 53లో మెదటి ప్రదన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రో”కె.నాగేశ్వర్ లాంటి నిస్వార్ధ మేధావిని పెద్దల సభకు నామినేట్ చేయడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని, విద్యావంతులు ఓటు వేసేముందు ఓకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిమ్ సభ్యులు పి.శ్రీకాంత్, శోభన్, క్రిష్ణ, రవి, తదితరులు పాల్గొన్నారు.
