
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ తుల్జాభవానీ ఆలయంలో కార్తీక మాసం పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక మంగళవారంను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. ఆలయ ప్రాంగణంలో పురోహితులు వేసిన రంగవళ్లులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.






