సొంత గూటికి మాజీ కౌన్సిల‌ర్ రాఘ‌వేంద్ర‌రావు

  • బిజెపిలోకి ఆహ్వానించిన పార్టి జిల్లా అధ్య‌క్షుడు సామ రంగారెడ్డి

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి టీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ కౌన్సిల‌ర్ కార్ల‌పుడి రాఘ‌వేంద్రరావు సొంత‌గూటికి చేరుకున్నారు. బిజెపి రాష్ట్ర నాయ‌కుడు మొవ్వా స‌త్య‌నారాయ‌ణ ఆద్వ‌ర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాగా రంగారెడ్డి జిల్లా అర్భ‌న్ అధ్య‌క్షుడు సామ రంగారెడ్డి రాఘ‌వేంద్ర‌రావుకు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాఘ‌వేంద్ర‌రావు రాక‌తో శేరిలింగంప‌ల్లి బిజెపి మ‌రింత బ‌లప‌డుతుంద‌ని సామ‌రంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ ముఖ్య నాయకులు డి.ఎస్.అర్.కే.ప్రసాద్, సాంబయ్య, సత్యనారాయణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

బిజెపి కండువా క‌ప్పి రాఘ‌వేంద్ర‌రావును పార్టీలోకి ఆహ్వానిస్తున్న సామ‌రంగారెడ్డి, డీఎస్ఆర్‌కే ప్ర‌సాద్‌

మియాపూర్ నుంచి కార్పొరేట‌ర్ బ‌రిలో…
మియాపూర్ డివిజ‌న్ బిజెపి కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా అదిష్టానం హామీతోనే రాఘ‌వేంద్ర‌రావు కాషాయ తీర్థం పుచ్చుకున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. డివిజ‌న్‌ నుంచి పోటిప‌డుతున్న బిజెపి సినియ‌ర్ నాయ‌కుడు డీఎస్ఆర్‌కే ప్ర‌సాద్ స్వ‌యంగా రాఘ‌వేంద్ర‌రావుకు మ‌ద్ధ‌తు తెల‌పుతూ పార్టీలో చేరేందుకు మర్గం సుగ‌మం చేయ‌డం విశేషం. శేరిలింగంప‌ల్లి మున్సిపాలిటీగా ఉన్న‌ప్పుడు ఒక‌ట‌వ వార్డు(మియాపూర్ ప్రాంతం) నుంచి గెలిచిన రాఘ‌వేంద్ర‌రావు అప్ప‌ట్లో స్థానిక అభివృద్ధిపై ప్ర‌త్యేకంగా పోరాడారు. ఈ క్ర‌మంలోనే మియాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. అదేవిధంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన రాఘ‌వేంద్ర‌రావుకు వారి సామాజిక వ‌ర్గంలోను స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ అభ్య‌ర్థిని త‌ట్టుకునేందుకు రాఘ‌వేంద్ర‌రావు స‌రైన అభ్య‌ర్థి అనే కోణంలో బిజెపి అధినాయ‌క‌త్వం ఆలోచిస్తున్న‌ట్టు తెల‌స్తుంది.

బిజెపి రంగారెడ్డి జిల్లా అర్భ‌న్ అధ్య‌క్షుడు సామ‌రంగారెడ్డికి త‌న బ‌యోడాటాను అంద‌జేస్తున్న రాఘ‌వేంద్ర‌రావు, డీఎస్ఆర్‌కే ప్ర‌సాద్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here