శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ మెయిన్ రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన తుల్జా భవాని హెయిర్ సెలూన్ షాప్ ను స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తుల్జా భవాని హెయిర్ సెలూన్ షాప్ ను ప్రారంభించడం జరిగిందని, హెయిర్ సెలూన్ షాప్ నిర్వహికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, కస్టమర్లకు నమ్మకంగా అనుగుణంగా మంచి సేవలను అందజేస్తూ వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెయిర్ సెలూన్ షాప్ నిర్వాహకుడు తుకారాం, సీనియర్ నాయకులు మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, యాదగిరి, రాణి తదితరులు పాల్గొన్నారు.






