శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పేరు మార్చడానికి కారణాలు ఏమిటో చెప్పాలని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ మొత్తంలో ఒక్క చందానగర్ సర్కిల్ పేరును ఎవరి కోసం మార్చారని అన్నారు. సర్కిల్ కార్యాలయాలన్నీ చందానగర్ లో, పేరు మాత్రం మియపూర్ గా మార్చారని అన్నారు. కొత్త సర్కిల్ గా మియపూర్ పేరు పెట్టడం ఎవరికి అభ్యతరం కాదు. కానీ చందానగర్ సర్కిల్ పేరును తీసివేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా నాయకులు స్పందిస్తారా ? లేరా ? ప్రజాప్రతినిధుల అండతో పేరు మార్చడాన్ని ఖండిస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులకు చందానగర్ సర్కిల్ పేరు తీసివేయటానికి బాధ్యత వహిస్తారా? లేదా? కొంత మంది ప్రజాప్రతినిధుల(బినామిల)కోసమే పేరు మార్చారు. దశాబ్దాకాలంగా ఉన్న చందానగర్ పేరుని తీసివేయటంలో ఎవరి ప్రోద్బలం ఉంది. ప్రజాప్రతినిధుల స్వలాభం కోసం అధికారులు పని చేయడం దారుణం. పార్టీలకు అతీతంగా నాయకులు అందరం స్పందించాలని అన్నారు.






