నమస్తే శేరిలింగంపల్లి: ఉద్యమకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చి త్వరలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఉద్యమకారులను ఏకం చేస్తున్న క్రమంలో శనివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో నివాసం ఉంటున్న రాజారాం ను కలిశారు. నాటి ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఉద్యమకారులకు గుర్తింపు లేకపోవడం బాధాకరమని అన్నారు. రాజారాంను కలిసిన వారిలో మిద్దెల మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, దత్తు, స్వామి, వెంకటేష్ పాల్గొన్నారు.