భారతీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ లో తెరాస మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలో మహిళతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డివిజన్ తెరాస అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత కరెంట్, నల్లా బిల్లులను మాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీదేనని అన్నారు. కేవలం తెరాసకు మాత్రమే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందని, ఇతరులకు లేదని అన్నారు.


మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిల సహకారంతో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రజలు తమకు న్యాయం చేసే నేతలనే పాలకులుగా ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ఆదర్శ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.