మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ క్యాంపు కార్యాలయంలో శనివారం తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో తెరాస పార్టీ స్టేట్ సెక్రటరీ, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ గట్టు రామచంద్రయ్య, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస రావు, పూజిత గౌడ్, రోజాదేవి రంగారావు, మంజుల రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెరాస పార్టీ సభ్యత్వాలను భారీ ఎత్తున చేపట్టాలని అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి చెబుతూ అధిక సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. అలాగే ఏరోజుకారోజు సభ్యత్వాలను ఆన్‌లైన్ లో నమోదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ నెల 28వ తేదీ లోపు సభ్యత్వాలను పూర్తి చేయాలని సూచించారు. సాధారణ సభ్యత్వానికి రూ.30, క్రియాశీల సభ్యత్వానికి రూ.100 రుసుము ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలు రూ.50 చెల్లిస్తే సరిపోతుందన్నారు. కార్యకర్తలకు చెందిన ఆధార్, పాస్ పోర్టు సైజ్ ఫొటో, మొబైల్ నంబర్, సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, రంగరావు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, తెరాస నాయకుడు ఆదర్శ్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు వాలా హరీష్, దామోదర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, గౌతమ్ గౌడ్, రాజు నాయక్, లక్ష్మీ నారాయణ, కృష్ణ గౌడ్, జిల్లా గణేష్, తెరాస నాయకులు వెంకటేశ్వర్లు, పోతుల రాజేందర్, నరేష్, చంద్రిక ప్రసాద్ గౌడ్, సురేందర్, అల్లం మహేష్, నవాజ్, తిరుపతి పాల్గొన్నారు.
