చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాలనీలోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్, ప్రెసిడెంట్ రఘునాథ రెడ్డి,సెక్రటరీ శ్రీనివాస్, మెంబర్లు జితేందర్, శేషాద్రి, సంతోష్, జయకృష్ణ, ప్రసాద్ రాజా, మల్లికార్జున రాజా, మల్లికార్జున్ రాజు, అడ్వైజర్లు బీపీ నాయుడు, రవీందర్ రావు, కృష్ణ, నర్సింహ రాజు పాల్గొన్నారు.
