మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్య రామ మందిర నిర్మాణానికి మాదాపూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆకారం వెంకటేష్ శనివారం రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు ఆయన చెక్కును గంగల రాధాకృష్ణ యాదవ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మ్యాడం బాలాజీ, కోశాధికారి మదిరే హరిశంకర్, సభ్యులు, మధుయాదవ్, గోవర్ధన్ రెడ్డి, బాల కుమార్ పాల్గొన్నారు.
