పార్టీ సంస్థాగతం కోసం ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలి: నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా చూసుకుంటామని, కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్ములు అని ,తెరాస పార్టీ యే మనకు శ్రీరామ రక్ష అని అన్నారు. పార్టీ ద్వి దశాబ్ది వేడుకలను హైటెక్స్ లో అట్టహాసంగా నిర్వహించుకున్నాం అని, అదే స్ఫూర్తి తో నవంబర్ 15 న వరంగల్ లో జరగబోయే విజయగర్జనకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్య మంత్రి కేసిఆర్ అని, క్రమశిక్షణ తో బాధ్యతాయుతంగా పని చేయాలని, పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేసి పార్టీ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పదవులు పొందిన వారు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, ఆయా డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్, రాజు నాయక్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, సమ్మారెడ్డి, లక్ష్మీనారాయణ, భాస్కర్, నాయకులు మల్లికార్జున శర్మ, పురుషోత్తం యాదవ్, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, వాలా హరీష్ రావు, కర్నాకర్ గౌడ్, మోహన్ ముదిరాజ్, సంజీవ రెడ్డి, దామోదర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జిల్లా గణేష్, గుడ్ల ధనలక్ష్మి, రామ కృష్ణ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, పార్టీ ప్రధాన అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశం లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
సమావేశం లో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here