గ్రామీణ కళాకారులు రాణించాలి: భేరీ రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన నా బర్రె డాక్యుమెంటరీ చిట్టి ది మిస్సింగ్ గర్ల్ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవ రత్న అవార్డు గ్రహీత భేరీ రామచందర్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ప్రతిభ ఉన్న ఎంతో మంది కళాకారులకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. నా బర్రె చిత్రం చిట్టి ద మిస్సింగ్ గర్ల్ చిత్ర దర్శకులు కుమారస్వామి, హీరోగా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న శివ రామ రెడ్డి కి చిత్ర దర్శక నిర్మాతలకు, రచయితలకు, నటీనటులకు ఈ రెండు చిత్రాలు మంచి విజయవంతమవుతాయన్నారు. నేటి సమాజంలో మంచి సందేశాత్మక చిత్రాలు అవసరం అని అన్నారు. చిత్రలేఖ బ్యానర్ లో చిట్టి షార్ట్ ఫిల్మ్ ని రూపొందించిన దర్శకుడు డా.జి కుమార స్వామి, చిత్రలేఖ స్టూడియోస్ అధినేత, నా బర్రె డాక్యుమెంటరీ ఫిల్మ్ దర్శకులు అజిత్ నాగ్, నిర్మాత, కరీంనగర్ పాల డైరీ వ్యవస్థాపకులు చెల్మెడ రాజేశ్వర్ రావుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.మాధవి వినోద్ కుమార్, మామిడి హరికృష్ణ, పెద్దింటి అశోక్ కుమార్, మేచినేనీ శ్రీనివాస్ రావు, రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం డైరెక్టర్ విష్ణు జైధీప్, నటులు మనోహర్ స్వామి, లోహిత్ కుమార్, రాయల హరిచంద్ర, శివ రామ్ రెడ్డి, రాజశేఖర్, కుమార్, రవి తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here