మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలని డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. శనివారం డివిజన్ పరిధిలోని మక్తా మహుబూబ్ పేట్ విలేజ్ లో డివిజన్ తెరాస నాయకులు శ్రీధర్ ముదిరాజ్, దయనంద్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో పార్టీలో సభ్యత్వం పొందిన పలువురికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సభ్యత్వాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మాధవరం గోపాల్, చంద్రిక ప్రసాద్ గౌడ్, గోపరాజు శ్రీనివాస్, రోజా, మైనార్టీ నాయకులు సద్దాం, రాజేష్ గౌడ్, సంతోష్, నరేష్, నర్సింగ్ రావు, ప్రభాకర్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, డి ప్రభు పాల్గొన్నారు.
