శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకుడు నర్సింహులు టీడీపీని వీడి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో నర్సింహులు చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ఉపాధ్యక్షుడు యాదా గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కొయ్యాడా లక్ష్మణ్ యాదవ్, కేఎన్ రాములు, ఎల్లదాసు, ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నర్సింహా రెడ్డి, జమ్మయ్య, రామచంద్రు, శ్యామ్, రాజు పాల్గొన్నారు.
