గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ సాయి వైభవ్ కాలనీ వాసులు శనివారం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేసిన ఖాజాగూడలో సాయి వైభవ్ కాలనీ వాసులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ లో కాలనీలలో ఏ చిన్న సమస్య తన దృష్టికి తీసుకువచ్చినా సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, కాలనీ అసోసియేషన్ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
