తెరాస స‌భ్య‌త్వ న‌మోదును విజ‌య‌వంతం చేయాలి: ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ గాంధీ

హ‌ఫీజ్‌పేట (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త విజ‌య‌వంతం చేయాల‌ని ఎంపీ డాక్ట‌ర్ జి.రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీలు అన్నారు. శ‌నివారం హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని మైత్రి నగర్ వద్ద రంజిత్ అన్న యువ సేన అధ్యక్షుడు ఆశిల శివ కుమార్, ఆశిల శ్యామ్ మోహన్, రామ్ మోహన్, సభ్యులు శ్యామ్, లోకేష్ ల‌ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ 2021-23 సంవత్సరానికి గాను నూతన టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలు పాల్గొన్నారు. అలాగే మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత గౌడ్ లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

తెరాస స‌భ్య‌త్వాల‌ను అంద‌జేస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ 

ఈ సంద‌ర్భంగా వారు తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం రంజిత్ రెడ్డి, గాంధీలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ సభ్యుడు కనకమామిడి వెంకటేష్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ తెరాస గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, దర్గా చిన్న గౌడ్, టిపియుఎస్ గంధం రాములు, నాయకులు మోహన్ ముదిరాజ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జనార్దన్ గౌడ్, యాదగిరి ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్, విజయ్ భాస్కర్ రెడ్డి, చాంద్ పాషా, సుబ్బు, సాయి కుమార్ యాదవ్, పూర్ణచందర్ రావు, నాగేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చంద్ర శేఖర్, లక్ష్మీనారాయణ, నవీన్ యాదవ్, జ్ఞానేశ్వర్, తిరుమల్లేశ్, సాబేర్, ఏరియా సభ్యులు సుదేశ్, బస్రాత్, జామీర్, మహేష్, హనీఫ్, నర్సింగ్ రావు, అచుత్, బాబు మోహన్ మల్లేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here