కుల‌మ‌తాల‌కు అతీతంగా ఉత్స‌వాల‌ను జ‌రుపుకోవాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ కాలనీలో జరిగిన ఖాజాగరిబాన్ నవాజ్ సందల్ ఉత్సవంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని దట్టి వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే కుల‌మతాలకు అతీతంగా అందరూ కల‌సి మెల‌సి ఉండి అన్ని ఉత్సవాలను జరుపుకోవాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కాస్ట్రో రెడ్డి, ఎస్ఐ మమ్మద్ పాషా, నిర్వాహ‌కులు షేక్ రజాక్, షేక్ ఖాజా, వార్డు మెంబర్ పర్విన్, తెరాస ఉపాధ్యక్షుడు యాదగౌడ్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్య‌క్షుడు గోపాల్ యాదవ్, సీనియర్ నాయకులు కేఎన్‌ రాములు, రాజేశ్వరమ్మ, గఫ్ఫార్, షకీల్, మమ్మద్ రియాజ్, ఫకీర్, ఇయాజ్, జహంగిర్, దస్తు, శ్రీనివాస్, అబ్దుల్ గని, రాజు, విఠ‌ల్, రవి, ఉస్మాన్, మహ‌మ్మద్ ఫ‌యాజ్, సయ్యద్ మజీద్, మోహన్ రాజు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సిఐ కాస్ట్రో రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here