గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో సోమవారం మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో తెరాస సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలువురికి సభ్యత్వాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
