చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని శేరిలింగంపల్లి డివిజన్ తెరాస ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, నాయకుడు కరుణాకర్ రెడ్డిలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం వారు ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, మహేష్ యాదవ్, నాగరాజు, మహేష్ పాల్గొన్నారు.







