కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నామని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. డివిజన్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సోమవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో కొనసాగుతున్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను హమీద్ పటేల్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణ పనులలో ఎటువంటి జాప్యం జరగకుండా ఉన్నత ప్రమాణాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ రోడ్ల పనులను చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాలనీ వాసులకు, ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్ కు హమీద్ పటేల్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఇంజనీర్ రమేష్, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఏరియా కమిటీ మెంబర్ కరీం, నాగేందర్, గౌతమ్, రాజు, రవి, యూత్ నాయకుడు దీపక్, కాలనీ వాసులు పాల్గొన్నారు.






