టీఆర్ఎస్ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారు – చందానగర్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన బిజెపి నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ నాయకులు గుండాల్లా వ్యవహరించి దాడి చేయడం సిగ్గుచేటని బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పై టీఆర్ఎస్ గుండాలు చేసిన దాడికి నిరసనగా బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో చందానగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ లు మాట్లాడుతూ కేసీఆర్ నిరంకుశత్వ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపి ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, మహిపాల్ రెడ్డి, నూనె సురేందర్, డివిజన్ అధ్యక్షుడు రాంరెడ్డి, ఆంజనేయులు, నవీన్ గౌడ్, కమలాకర్ రెడ్డి, మహిళా నాయకులు మేరి, విజయలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చందానగర్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేసిన బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here