శేరిలింగంపల్లి నియోజకవర్గం లో సామూహిక జాతీయ గేయాలాపన

నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఈ నెల 22 వరకు ఘనంగా నిర్వహించనున్న దృష్ట్యా ఆగస్టు 16న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉదయం 11.30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన చేసి అన్ని వర్గాల ప్రజలు దేశ భక్తిని చాటుకున్నారు.
గచ్చిబౌలి విప్రో సర్కిల్ లో..
భరతమాత దాస్య శృంఖలాలను తెంచి, బ్రిటీష్ వలస పాలనను పారదోలాలనే మహా సంకల్పంతో భారత స్వాతంత్ర్య సమరంలో మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా మహోద్యమాన్ని గుర్తుచేసుకుంటూ ఎందరో మహనీయుల త్యాగాల ద్వారా సాధించుకున్న స్వతంత్ర భారతాన్ని సగర్వంగా నిలుపుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, తహశీల్దార్ వంశీ మోహన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, గౌరవ మాదాపూర్ డీసీపీ పుష్ప వల్లి, ఏసీపీ రఘునందన్ రావు, ట్రాఫిక్ ఏసీపీ హన్మంతరావు, సీఐ సురేష్, మాజీ కార్పోరేటర్ సాయి బాబా తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.‌ ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, సత్యనారాయణ, నరేష్, సురేందర్, జగదీష్, మల్లేష్, వినోద్, రమేష్, సల్లావుద్దీన్, అక్బర్, అంజమ్మ, గోవింద్, నవాజ్, నర్సింహ రాజు, శ్రీనివాస్, నారాయణ, నగేష్, అశోక్, మహాదేవప్ప, అమర్, సుధీర్, బిక్షపతి, సుగుణ, బాలమణి, పోలీస్ సిబ్బంది, ఐటీ మిత్రులు, ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జడ్సీ శంకరయ్యతో కలిసి సామూహిక‌‌ జాతీయ గీతాలాపాన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

తారానగర్ మార్కెట్ రోడ్డులో..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచిన సాముహిక జాతీయ గీతాలాపనను తారానగర్ మార్కెట్ రోడ్డులో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజిక కార్యకర్త దొంతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ యూత్ అధ్యక్షుడు దొంతి కార్తిక్ గౌడ్, తారానగర్ వార్డు మెంబర్ కవిత, దుర్గం జనార్దన్ గౌడ్, పాండు ముదిరాజ్, ఎండి నయీం, ఏఎస్ఐ నరసింహా రెడ్డి, నరేందర్ రెడ్డి, తారానగర్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

తారానగర్ మార్కెట్ రోడ్డులో దొంతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సామూహిక‌ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యం

మాదాపూర్ లోని శిల్పారామంలో సిబ్బంది, సందర్శకులు, ఆర్టిసన్స్ తదితరులు జాతీయ జెండాకు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.

శిల్పారామంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సిబ్బంది, తదితరులు

మదీనగూడలోని యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్, ఎంఈఓ, హెచ్ఎం యూసుఫ్, విద్యార్థులు సామూహికంగా జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతాలాపన చేశారు.

మదీనగూడ యూపీఎస్ లో సామూహికంగా ‌జాతీయ గేయాలాపన చేస్తున్న కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

చందానగర్ లో…
75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్స ద్వి సప్తాహం కార్యక్రమంలో భాగంగా చందానగర్ సీఐ క్యాస్ట్రో ఆధ్వర్యంలో చందానగర్ గంగారం ఆర్ఎస్ బ్రదర్స్ వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, చందానగర్ పోలీసులు, ప్రజలు, స్థానికులు, వాహనదారులు పెద్ద ఎత్తున పాల్గొని 11:30 నిమిషాలకు జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, చందానగర్ సీఐ క్యాస్ట్రో, ఎస్ఐ శ్రీధర్, ఆర్ఎస్ బ్రదర్స్ సిబ్బంది, టిఆర్ఎస్ నాయకులు దాసు, నరేంద్ర భల్లా, హరీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గంగారం ఆర్ఎస్ బ్రదర్స్ వద్ద సీఐ క్యాస్ట్రో, పోలీస్ సిబ్బంది తో కలిసి జాతీయ‌ గేయాలాపన చేస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

మదీన గూడలో..
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మదీనగూడ గ్రామంలో కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ లు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.
మాతృభూమి కోసం, తమ ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డలను స్మరించుకుంటూ, ఆ మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు.

మదీనగూడలో గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

గచ్చిబౌలి డివిజన్ లో..
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల ఫ్లైఓవర్ సిగ్నల్ వద్ద సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజలు, డివిజన్ నాయకులు , స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జాతీయ గీతాలాపన చేశారు. గుండెల నిండా దేశభక్తిని నింపుకుని భవిష్యత్ నిర్మాణం కోసం యువత నడుంబిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చారిత్రాత్మకంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

నల్లగండ్ల ప్లై ఓవర్ సిగ్నల్‌ వద్ద జాతీయ గీతాలాపన చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్టి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here