కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్స్ లో డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి హమీద్ పటేల్ ని గెలిపించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.






