హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ సమగ్రాభివృద్ధికి బీజేపీని గెలిపించాలని డివిజన్ బీజేపీ అభ్యర్థి బోయిని అనూష మహేష్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని సాయినగర్ తోపాటు పలు కాలనీల్లో ఆమె బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బోయిని అనూష యాదవ్ మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ లో జనాభాకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్లను ఆధునీకరించేందుకు కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్ నాయకులు తాము ఇచ్చిన హామీలను విస్మరించి మరోసారి ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఓట్లు అడుగుతున్నారని అన్నారు. వరద బాధితులకు రూ.10 వేల సహాయం అందించడంలో టీఆర్ఎస్ నేతలు పూర్తిగా విపలమయ్యారని ఆరోపించారు. హఫీజ్ పేట్ కార్పొరేటర్ గా గెలిపిస్తే డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దేనందుకు అంకితభావంతో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్ గౌడ్, శ్రీశైలం, వెంకన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనప్రియ అపార్ట్‌మెంట్‌లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.


