తెరాస‌తోనే అభివృద్ధి: మంజుల ర‌ఘునాథ్ రెడ్డి

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గత 5 ఏళ్లుగా శేరిలింగంప‌ల్లిలోని అన్ని డివిజ‌న్ల‌లో జ‌రిగిన అభివృద్దిని చూసి ప్ర‌జ‌లు తెరాస‌కు ఓటు వేయాల‌ని చందాన‌గ‌ర్ డివిజ‌న్ తెరాస కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి మంజుల ర‌ఘునాథ్ రెడ్డి అన్నారు. గురువారం డివిజ‌న్ ప‌రిధిలోని వేమ‌న వీక‌ర్ సెక్ష‌న్ బ‌స్తీలో ఆమె ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెరాస‌తోనే అభివృద్ది సాధ్య‌మ‌న్నారు. గ్రేట‌ర్ పీఠంపై క‌చ్చితంగా తెరాస జెండా ఎగురుతుంద‌న్నారు. సీఎం కేసీఆర్ వెంటే ప్ర‌జ‌లంద‌రూ ఉన్నార‌ని అన్నారు. ఎన్నిక‌ల్లో తెరాస అభ్య‌ర్థులు భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న మంజుల ర‌ఘునాథ్ రెడ్డి
కారు గుర్తుకు ఓటు వేయాల‌ని మ‌హిళ‌ను చేతులెత్తి కోరుతున్న మంజుల ర‌ఘునాథ్ రెడ్డి
ప్ర‌చారంలో భాగంగా ఓ బండి వ‌ద్ద దుస్తుల‌ను ఇస్త్రీ చేస్తున్న మంజుల ర‌ఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here