గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ తెరాస నాయకులు సంపత్ , శ్రీకాంత్ , కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్ కి చెందిన తెరాస నాయకులు తిరుపతి, రజినీకాంత్ లకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెరాస పార్టీ సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో మరింత చురుగ్గా సభ్యత్వాలను నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.
