నిజాంపేట్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రగతి నగర్ అంబీర్ చెరువు సుందరీకరణ పనులను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీల గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజు యాదవ్, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, సురేష్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ.. అంబీర్ చెరువు వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి చెరువును సంరక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నాయి నేని చంద్రకాంత్, జోగిపేట్ భాస్కర్, బాల్ రాజు, కాలనీ వాసులు రమేష్ బాబు, మహేష్, స్థానికులు పాల్గొన్నారు.
