ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆల్విన్ కాలనీలో డివిజన్ తెరాస అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ర్యాలీ నిర్వహించారు. తెరాస నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించగా ఆ ర్యాలీని గాంధీ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో దొడ్ల వెంకటేష్ గౌడ్‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రేటర్ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.