న‌గర అభివృద్ది తెరాస హ‌యాంలోనే జ‌రిగింది : ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

హైద‌ర్‌న‌గ‌ర్‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెరాస ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి, ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలే పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తాయ‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. ఆదివారం హైద‌ర్‌న‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని నిజాంపేట్ రోడ్డులో క్షత్రియ అసోసియేషన్ సభ్యులతో నిర్వ‌హించిన‌ ఆత్మీయ సమావేశంలో TSCAB ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
పాల్గొన్న క్షత్రియ అసోసియేషన్ సభ్యులు

ఈ సంద‌ర్బంగా గాంధీ మాట్లాడుతూ.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ అభివృద్ధి తెరాస హ‌యాంలోనే జ‌రిగింద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు న‌గ‌రానికి చేసిందేమీ లేద‌న్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు చెప్పే మాట‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. తెరాస అభ్య‌ర్థుల‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here