మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గత 5 సంవత్సరాల కాలంలో తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కోరారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తెరాస నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీని నాయకుడు బండి రమేష్, డివిజన్ తెరాస అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. కేవలం తెరాసతోనే నగరాభివృద్ధి సాధ్యమన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తేనే హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందన్నారు. డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
