శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని తెరాస కార్పొరేటర్లు గురువారం తరలివెళ్లారు. అంతకు ముందు వారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిశారు. అనంతరం గాంధీతో కలిసి నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బస్సులో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత, జగదీశ్వర్ గౌడ్, రోజా రంగరావు, మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గా ఎన్నికైన శుభసందర్భంగా గద్వాల విజయలక్ష్మికి, డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన మోతె శ్రీలత శోభన్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
