మదీనాగూడలో TRP మహిళా కమిటీ ఏర్పాటు.. డివిజన్ అధ్యక్షురాలిగా నీలవేణి..

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మదీనాగూడలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో నూతన మహిళా కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదీనాగూడ డివిజన్ మహిళా అధ్యక్షురాలిగా నీలవేణిని నియమించారు. అలాగే పలువురు మహిళా నాయకులు TRPలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మింగాని నర్సింగ్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి వనం పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. మహిళల్లో రాజకీయ చైతన్యం పెరుగుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఆకర్షితులు కావడం ఆనందకరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ప్రతి పాఠశాలలో విద్య కమిటీలను ఏర్పాటు చేసి ఫీజుల భారం తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లడంలో మహిళలు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు వి. నీలిమ, సుధాకర్ లక్ష్మి, స్వప్న, విఠలాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here