కొండాపూర్‌లో TRP విస్తరణ.. డివిజన్ అధ్యక్షుడిగా మహమ్మద్ జ‌హంగీర్ నియామకం..

శేరిలింగంప‌ల్లి, మే 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమం ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ జ‌హంగీర్‌ను నియమిస్తూ పార్టీ నాయకులు అధికారిక ఆర్డర్ కాపీ అందజేశారు. కార్యక్రమంలో హ‌ఫీజ్‌పేట ప్రాంతానికి చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. వారికి పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగాని నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ ముస్లింల‌ భారీ చేరిక పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జావేద్ భాయ్, ఫిరోజ్ భాయ్, ఫయాజ్ భాయ్, అమర్, సమీర్, షరీఫ్, మౌసీన్, ఖదీర్, జుబేర్, అభిషేక్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here