నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ కు ఘ‌న నివాళి

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియపూర్ క్రాస్ రోడ్ చౌరస్తాలో బీజేపీ యువ మోర్చా శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ కుమ్మరి జితేందర్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నేతాజీ చిత్ర‌ప‌టానికి బీజేపీ, బీజేవైఎం నాయ‌కులు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ నాయ‌కులు

అనంత‌రం బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ చేసిన కృషి మ‌రువ‌లేనిద‌న్నారు. ఆజాదా హింద్ ఫౌజ్ పేరిట భార‌త జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి యువ‌త‌ను స్వాతంత్య్ర పోరాటం వైపు మ‌ళ్లించార‌ని అన్నారు. ఆయ‌న చూపిన తెగువ‌, చేసిన పోరాటం యువ‌త‌కు స్ఫూర్తినిస్తాయ‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, సీనియర్ నాయకుడు రవి కుమార్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, మియపూర్ కార్పొరేటర్ అభ్యర్థి రాఘవేంద్రరావు, జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, నాయకులు సమ్మెట ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, శ్రీధర్ రావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు హరికృష్ణ, చంద్ర మోహన్, హరి ప్రియ, బీజేపీ నాయకులు రవి గౌడ్, మహేష్ ముదిరాజ్, చందు, లక్ష్మణ్ ముదిరాజ్, మధు యాదవ్, శ్రీనివాస్ యాదవ్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు సిద్దు, మధుసుధన్ రావు, నందు, నవీన్ రెడ్డి, బీజేవైఎం నాయకులు వెంకట్, శివ, మనోజ్, లక్కీ, శ్రీకాంత్, కిరణ్, రాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here