శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, ఏడీసీపీ హనుమంత రావు, సీఐ ప్రశాంత్‌లు కలిపి పరిశీలించారు. మియాపూర్‌లోని మియాపూర్ ఎక్స్ రోడ్డు, ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఫ్రీ లెఫ్ట్, మియాపూర్ బస్ స్టాప్ సర్వీస్ రోడ్డు, మియాపూర్ మెట్రో పిల్లర్ నం.600 వద్ద ఏర్పాటు చేసిన అదనపు యు-టర్న్‌లను వారు పరిశీలించారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు.






