పీజేఆర్ ఫ్లై ఓవ‌ర్‌తో భారీగా త‌గ్గ‌నున్న ట్రాఫిక్ ర‌ద్దీ: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి డివిజన్ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ నుండి శిల్ప లేఔట్ స్టేజ్ 2 కొండాపూర్ వైపు SRDP కింద రూ. 182.72 కోట్ల అంచనా వ్యయంతో 1.2 కి.మీ పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ లతో ఉన్న బైడైరెక్షనల్ పీజేఆర్ ప్లైఓవర్ ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శిలాఫలాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంబీసీ ఛైర్మెన్ జెరిపేటి జైపాల్, మాజీ ఎమ్మెల్సీ దయాకర్, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్, జిహెచ్ఎంసీ కమీషనర్ కర్ణన్, శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ హేమంత్, డిప్యూటీ కమీషనర్ ప్రశాంతి, శేరిలింగంపల్లి నియోజకవర్గం డివిజన్ ల కార్పొరేటర్లతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ ప్లైఓవర్ కు పీ జనార్దన్ రెడ్డి పేరిట నామకరణం చేసినందుకు ఎంతో సంతోషమని అన్నారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని, గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుంద‌ని, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here