శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): సిమెంట్ రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ కేఎస్ఆర్ కాలనీలో నుతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణా పనులను కాలనీ వాసులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. కాలనీ వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సిసి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనుల్లో నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్మించే రోడ్డు ఉపరితలం (సర్ఫేస్) సమతలంగా ఉండాలని, వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగారెడ్డి, రామారావు, సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.