శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చెన్నై నుండి వచ్చిన భరతనాట్య కళాకారిణి స్మ్రితి విక్రమ్ తన ప్రదర్శనలో పుష్పాంజలి, మయూర అలరిపు, శివ స్తుతి, అభంగ్ , తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో శ్రీ నృత్య అకాడమీ ప్రత్యుష శిష్య బృందంచే కూచిపూడి నృత్యంశంలో స్వరపల్లవి, వినాయక కౌతం, ఇందరికి అభయములిచ్చు, భజమానస, రామాయణ శబ్దం, జయము జయము, జతిస్వరం, తిల్లాన అంశాలను శివాని, సాన్విత సాయి, సాత్విక, అనన్య సాయి, అపూర్తి, సాన్విక, శ్రీజీవిత, హంసిక, సహస్ర, ధ్రితి, నిత్య, నేహా, ఐశ్వర్య, హాసవిత, దుర్గ, హిమశ్రీ ప్రదర్శించి మెప్పించారు.