శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్, ఎల్లమ్మబండలో రూ. 5 కోట్ల 30 లక్షలతో నూతనంగా చేపట్టబోయే మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్, హిందూ శ్మశాన వాటిక నిర్మాణం పనులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్, హిందూ శ్మశాన వాటిక నిర్మాణం పరిశీలించడం జరిగిందని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో E.E గోవర్ధన్ గౌడ్, డిప్యూటీ E.E రమేష్, AE శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, జోగిపేట్ భాస్కర్, మల్లేష్, గుడ్ల శ్రీనివాస్, షౌకత్ అలీ మున్నా, దాతి రమేష్, పోశెట్టిగౌడ్, బాలరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






